మావోయిస్టు పార్టీ అగ్రనేత విక్రమ్ గౌడ్ హతం
కర్ణాటకలోని ఉడుపి అటవీప్రాంతంలో ఘటన
బెంగళూరు, నవంబర్ 19: కర్ణాటకలోని ఉడుపికి 50 కిలోమీటర్ల దూరంలోని కబ్బినలే గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావో యిస్టు పార్టీ అగ్రనేత విక్రమ్ గౌడ్ (44) మృతిచెందారు. చిక్‌మగళూరు, ఉడిపి తదితర పశ్చిమ కనుమల ప్రాంతంలో మావో యిస్టుల కదిలికలు ఉన్నట్లు కర్ణాటక పోలీసులు సమా చారం అందుకుని కూంబి ంగ్ ప్రారంభిం చారు. సోమవారం అర్ధరాత్రి హెబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబ్బినలే అటవీప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఫోర్స్ (ఏఎన్‌ఎఫ్)తో కలిసి సంయుక్తంగా అడవిని జల్లెడ పడుతుండగా, వారికి మావోయిస్టులు తారసపడ్డారు.
ఇరువర్గాల మధ్య కొన్ని నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. భద్రతా బలగాల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత విక్రమ్ గౌడ్ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మరణాన్ని కర్ణాటక పోలీస్‌శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. 13 ఏళ్ల తర్వాత కర్ణాటకలో మొదటిసారి ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.