calender_icon.png 2 November, 2024 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ తొలి ఎన్నిక విశేషాలివే..

29-04-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రజాస్వామ్యంలో పోలింగ్ అత్యంత కీలకమై న అంశం. స్వాతంత్య్రం వచ్చిన త ర్వాత 1952లో మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో మొత్తం 489 ఎంపీ స్థానా ల్లో అభ్యర్థులు బరిలో దిగారు. ఎన్నికల్లో ప్రధానంగా 53 పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా 533 మంది బరిలో ఉన్నారు. నాటి ఎన్నికలకు రూ.10.45 కోట్లు ఖర్చయ్యాయి. మొట్టమొదటి ఎన్నికల సంఘం కమిషనర్‌గా సుకుమార్ సేన్ వ్యవహరించారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు లేదా వారి వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యే వరకు పదవిలో ఉంటా రు. రెండు పరిమితుల్లో ఏది ముం దైతే అది అమలులోకి వస్తుంది. 1982లో కేరళలోని ఉత్తర పరావూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు.