మహారాష్ట్రలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కారణంగా మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇదే సమయంలో జీబీఎస్ బారిన పడిన వారి సంఖ్య 149కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అసోంలో కూడా జీబీఎస్ కేసులు నమోదు కాగా శనివారం ఆ రాష్ట్రంలో తొలి మరణం నమోదైంది. జీబీఎస్ బారిన పడిన వారిలో సొంత రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడి చేస్తుంది.