calender_icon.png 18 January, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజు ఆట రద్దు..

10-09-2024 03:10:32 AM

కివీస్, ఆఫ్గన్ ఏకైక టెస్టు

నోయిడా: అఫ్గానిస్తాన్‌ోౌన్యూజిలాండ్ జట్ల మధ్య గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు తొలి రోజు ఆట రద్దయింది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఔట్ ఫీల్డ్ పూర్తి చిత్తడిగా మారి పోయింది. అంపైర్లు పలుమార్లు పిచ్‌ను పరిశీలించినప్పటికీ ఫీల్డింగ్ చేయడం సాధ్యం కాదని తేల్చడంతో కనీసం టాస్ కూడా పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వారం రోజులుగా అక్కడ వర్షాలు పడడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మరి నేడైనా ఆట సాగుతుందో లేదో చూడాలి.