calender_icon.png 18 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు హాజరు 50%

18-11-2024 12:15:08 AM

  1. హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నది 76.4శాతం
  2. ప్రశాంతంగా గ్రూప్-౩ పరీక్షలు 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం జరిగిన గ్రూప్-3 పరీక్షలకు సుమారు 50 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 76.4శాతం మాత్రమే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. అందులో పేపర్-1 పరీక్షకు 273847 మంది (51.1శాతం) హాజరవ్వగా, పేపర్-2 పరీక్షకు 272173 (50.7శాతం) మంది మాత్రమే హాజరైనట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

గ్రూప్-3 పరీక్ష కోసం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా 76.4శాతం మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64.5 శాతం మంది పరీక్ష రాయగా, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 41శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు హాజరు శాతం 51శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. 

పరీక్షకు లేటుగా వచ్చారు

విజయక్రాంతి, నవంబర్ 17: ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షకు కొందరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. 8 మంది అభ్యర్థులు 5 నిముషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన కలెక్టర్ రాజార్షిషాను కలిసి ఆలస్యంగా రావడానికి బస్సులు కారణమని తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

అందుకు నిబంధనలు ఒప్పుకోవని కలెక్టర్ చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ పరీక్ష కేంద్రం వద్దకు లింగంపేట్‌కు చెందిన సంజీవ్ ముందుగానే హాజరయ్యాడు. గుర్తింపు కార్డు లేకపోవడంతో జిరాక్స్ కోసం వెళ్లాడు. వచ్చేసరికి రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించలేదు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంట ర్‌కు మూడు నిమిషాలు లేటుగా వచ్చిన అభ్యర్థిని అధికారుల అనుమతించలేదు. నల్లగొండలో జరిగిన పరీక్షకు కూడా కొం దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. స్ర్కైయిబ్ అభ్యర్థులు కొందరు తమకు అదనపు సమయం అవసరం లేదని దరఖాస్తులో పేర్కొన్నా అవేవి పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థులందరినీ అదనంగా గంటపాటు గదిలోనే కూర్చోబెట్టారు.

దీంతో మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన పలువురు రెండో పేపర్‌కు సకాలంలో పరీక్షకు హాజరు కాలేదు. తమకు అదనపు సమయం అవసరంలేదని ఇన్విజిలేటర్‌ను చెప్పినా ఉన్నతాధికారుల నిబంధనల మేరకు నడుచుకుంటున్నట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.