దిల్లీ: ఆన్లైన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫస్ట్ క్రై మాతృ సంస్థ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ.4,194 కోట్లు సమీకరించనుంది. ఆగస్టు 6 నుంచి సబ్‌స్క్రిప్షన్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.440-465గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఆగస్టు 5న సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఐపీఓలో భాగంగా 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం చొప్పున రిజర్వ్ చేశారు. ఇన్వెస్టర్లు ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 32 షేర్లను (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.