18-03-2025 05:40:13 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్ లో గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలని మంగళవారం భద్రాచలం జ్యూడిషియల్ ప్రధమ శ్రేణి న్యాయమూర్తి వి. శివనాయక్ సందర్శించారు. ఈ సందర్బంగా కళాశాలలోని వివిధ సమస్యలను విద్యార్థినులు న్యాయమూర్తికి వివరించారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు తరగతి గదులు, డార్మెటరీ గదులు, మంచినీటి సౌకర్యాలు పరిశీలించి, న్యాయమూర్తి బాధ్యులకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో మండల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.