మేడ్చల్ పరిధిలో తొలికేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): కొత్త న్యాయ చట్టాల ప్రకారం ఎక్సైజ్ శాఖలో తొలికేసు నమోదయింది. మేడ్చల్ ఎక్సైజ్ అధికారుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గంజాయి తీసుకొచ్చి నగరంలో అమ్ముతోందనే సమాచారంతో మేడ్చల్ డీటీఎఫ్ ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీ లు చేపట్టారు. ఫతేనగర్ నుంచి బాలనగర్ వెళ్లే మార్గంలో ఫ్లువర్ కింద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విజయలక్ష్మి మరో వ్యక్తితో కలిసి ఓ బైక్‌పై వెళ్తుంది. దీంతో, వారిని ఆపి తనిఖీ చేయగా 2.1 కిలోల గంజాయి పట్టుబడింది. విజయలక్ష్మితో పాటు రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామానికి చెందిన సాయితేజను అదుపులోకి తీసుకున్నారు.