07-07-2024 02:03:05 AM
హత్రాస్ ఘటనపై కేంద్రం ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ, జూలై 6: యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు దేశంలో విషాదాన్ని నిపింది. ఫలితంగా భోలే బాబా పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఘటన జరిగిన సమయం నుంచి పరారీలో ఉన్న భోలే బాబా అలియాస్ నారాయణ హరి సకార్ తొలిసారి మీడియా ముందుకువచ్చారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పలు విషయాల గురించి మాట్లాడారు. జూలై 2 ఘటనతో మేము చాలా వేదనకు గురయ్యాం. ఈ పరిస్థితుల్లో బాధను భరించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. తొక్కిసలాటకు బాధ్యులైన వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకోలేరని నమ్ముతున్నా. నాకు ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. మృతులు, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించానని మీడియాకు వెల్లడించారు.
బాబాపై తొలి కేసు..
హత్రాస్ తొక్కిసలాట ఘటన విషయంలో భోలే బాబాపై తొలి కేసు నమోదైంది. పాట్నా కోర్టులో ఈ కేసు దాఖలైందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంచనాలకు మించిన భక్తులు రావడం వల్లనే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కోర్టులోనూ బాబా వేదిక నుంచి వెళ్లిన తర్వాతనే ప్రమాదం జరిగిందని బాబా తరఫు న్యాయవాది వివరించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆ రోజు ముఖ్య సేవాదార్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్ మధుకర్ నిందితుడిగా ఉన్నారు. అతనిని శుక్రవారం రాత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మధుకర్ ఇటీవల పలువురు రాజకీయ నేతలతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాబా నిర్వహించే కార్యక్రమాలకు నిధులు, విరాళాలు సేకరించేవాళ్లని వెల్లడించారు. ప్రస్తుతం అతనితో పాటు కేసులో ప్రమేయం ఉన్న అనేక మంది లావాదేవీలు,కాల్ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.