ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో బయో మైనింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడమే కాకుండా రీసైక్లింగ్ చేసే పద్ధతిలో చెత్తను వేరు చేసి ఎరువుని సేకరించి అందించడమే బయో మైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం.
అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదటి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేతులు మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బయో మైనింగ్ కేంద్రం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. బయో మైనింగ్ ద్వారా పలు దశల్లో చెత్తను రీసైక్లింగ్ చేస్తుందని ప్లాస్టిక్ పదార్థాలు ఎరువులు వేరుచేసి అందిస్తుందని తెలిపారు.
రోజుకు రెండు మూడు టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు అణువుగా మిషన్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదటి బయోమైనింగ్ కేంద్రాన్ని ఇల్లందులో ప్రారంభించడం చాలా సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డి ఈ మురళి, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, జవాన్ ప్రకాష్, కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.