హైదరాబాద్: నిజాలు మాట్లాడినందుకు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. ఎఫ్ఐఆర్ లను తను మెడల్స్ గా భావిస్తానని పేర్కొన్నారు. మైనర్ తో ఓటు వేయించినా ఎఫ్ ఐఆర్ నమోదు చేయని అధికారులు తనపై మాత్రం స్వేచ్ఛగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓక అభ్యర్థిగా పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లను తనిఖీ చేసే హక్కు తనకు ఉందని, మర్యాదగా ముస్లిం మహిళా ఓటర్ల బురఖా తొలగించిమని అడిగానని ఆమె పేర్కొన్నారు.
అందులోనూ తప్పులు వెతికితే, వాళ్లు భయపడినట్లేన అని ఆమె ప్రశ్నించారు. సోమవారం పోలింగ్ సందర్భంగా బిజెపి నాయకురాలు బురఖా ధరించిన ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను పోలింగ్ బూత్‌లో తనిఖీ చేస్తూ, వారి ముసుగును ఎత్తమని లేదా తీసివేయమని కోరుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వివాదానికి దారితీసింది. పోలీసులు మాధవీలతపై ఐపీసీ సెక్షన్లు 171సి, 186, 505(1)(సి), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద కూడా కేసు నమోదు చేశారు.