06-03-2025 12:00:00 AM
పనులు పరిశీలించిన ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్, మార్చి 5(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ పనులను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. జిల్లాలోని నార్సింగి గ్రామ శివారులో పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ కొరకు వేరే జిల్లాలోని ఫైరింగ్ రేంజ్ కు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఫైరింగ్ రేంజ్ లేని లోటును త్వరగా పూర్తి చేసి, త్వరగా అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ రంగా నాయక్, రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఆర్‌ఐ శైలేందర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.