calender_icon.png 4 December, 2024 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై కాల్పులు

04-12-2024 10:41:19 AM

అమృత్‌సర్: శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల 'సేవాదర్' విధులు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గోడకు తగలడంతో వీల్ చైర్‌లో కూర్చున్న బాదల్ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. స్వర్ణ దేవాలయం వెలుపల నిలబడిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపిన వ్యక్తిపై దాడి చేశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది అయిన నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. ఇప్పటికే అతనిపై అనేక కేసులున్నట్లు సమాచారం. సంఘటన జరిగిన సమయంలో, నరేన్ సింగ్ చౌరా సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు దగ్గరగా నిలబడి ఉన్నాడు. సుఖ్‌బీర్ బాదల్‌పై కాల్పులు జరిపినప్పుడు గురి తప్పడంతో సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు ప్రాణపాయం తప్పింది. కాల్పులు జరుపుతున్న దుండగుడిని బాదల్ అనుచరులు అడ్డుకున్నారు.