calender_icon.png 24 December, 2024 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌లో చైనీయులపై కాల్పులు

06-11-2024 12:46:50 AM

  1. కరాచీలో బుల్లెట్ల వర్షం కురిపించిన దుండగులు
  2. ఇద్దరి పరిస్థితి విషమం

నవంబర్ 5: పాకిస్థాన్‌లో చైనా పౌరులపై దాడుల పరంపర కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో జరిగిన ఆత్మాహుతి దాడిని మరువకముందే తాజాగా మంగళవారం కరాచీలో మరోసారి దుండగులు ఇద్దరు చైనీయులపై కాల్పులకు తెగబడ్డారు. దాడిలో వారివురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు.

తమ దేశ పౌరులపై జరుగుతున్న దాడులను పాకిస్థాన్‌లోని చైనా రాయబారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో చైనీయులకు మెరుగైన భద్రత కల్పించాల్సిన ఆవశ్యక తను కూడా నొక్కి చెప్పారు. కాగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఏడాదిలో మూడోసారి..

పాకిస్థాన్‌లో చైనా పౌరులపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. అక్టోబర్ నెలలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనా పౌరులు మరణించగా,10మంది గాయపడ్డా రు. కరాచీ ఎయిర్‌పోర్ట్ సమీపం లో జరిగిన ఈ పేలుళ్లకు నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. పదేళ్ల క్రితం చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడాడ్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి 21మంది చైనా పౌరులు మరణించారు.