calender_icon.png 2 February, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో కాల్పుల కలకలం

01-02-2025 10:02:42 PM

పాత నేరస్తుడిని పట్టుకొనే క్రమంలో గన్ తో ఎదురుదాడికి దిగిన దుండగుడు

కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ కు గాయాలు

గచ్చిబౌలి ప్రీజం పబ్ లో ఘటన...

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో పాత నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. నిందితుడు రెండు రౌండ్లు ఫైరింగ్ చేయడంతో ఓ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్కు గాయాలు అయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు దొంగను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పబ్ లో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గచ్చిబౌలిలో కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. పోలీసుల ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.