calender_icon.png 14 November, 2024 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేయసిని దూరం చేశారని కాల్పులు

11-11-2024 12:51:44 AM

సరూర్‌నగర్‌లో యువకుడి హల్‌చల్

ఎల్బీనగర్, నవంబర్ 10 : ప్రేయసిని తన నుంచి దూరంగా పంపించారని ఆగ్రహంతో ఒక యువకుడు యువతి తండ్రిపై కాల్పులకు పాల్పడిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం సృష్టించింది. సరూర్ నగర్‌లోని వెంకటేశ్వరకాలనీలో పెరిశెట్టి రేణుకా ఆనంద్(57).. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉం టున్నాడు. చిన్నకుమార్తె మన్వీత(23) గడ్డిఅన్నారంలోని వికాస్ భారతి స్కూల్‌లో 7వ తరగతి చదివే సమయంలో అంబర్‌పేటకు చెందిన గోగిక ర్ బల్వీందర్‌సింగ్ (25) క్లాస్‌మెట్‌తో పరిచయం.

అప్పటినుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నా రు. 6 నెలల క్రితం బల్వీంద్‌ర్‌సింగ్ సరూర్‌నగర్‌కు వచ్చి నీ కూతుర్ని ప్రేమిస్తున్నాని అడ్డుపడితే నిన్ను చంపుతానని యువతి తండ్రి ఆనంద్‌ను బెదిరించాడు. ఈ క్రమంలో మన్వీతను కుటుంబ సభ్యులుఇటీవల ఎవరికీ తెలియకుండా అమెరికాకు పంపించారు.

విషయం తెలియడంతో బల్వీందర్‌సింగ్ ఆదివారం మన్వీత ఇంటికి వెళ్లి  తనవెంట తెచ్చుకున్న ఎయిర్‌గన్‌తో ఆనంద్‌పై కాల్పులకు దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆనంద్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. యువతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో బల్వీందర్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎయిర్‌గన్‌తో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.