calender_icon.png 9 January, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదులుతున్న రైలుపై కాల్పులు

07-11-2024 01:37:21 AM

ఒడిశాలో ఘటన

భువనేశ్వర్, నవంబర్ 6: కదులుతున్న రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన ఘటన ఒడిశాలోని భద్రక్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి పూరీ వైపు వెళ్తున్న నందన్‌కానన్ ఎక్స్‌ప్రెస్ భద్రక్, బవుసపూర్ జంక్షన్ వద్ద కొందరు దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గార్డు బోగీ కిటికీకి బులెట్ తగలడంతో అద్దం పగిలిపోయింది.  పేలిన శబ్దం రావడంతో గార్డు నరేంద్ర బెహరా చుట్టు పక్కల పరిసరాలను పరిశీలినట్టు చెప్పారు. ఈ క్రమంలో దుండగుల్లో ఒకరు పారిపోతూ కనిపించినట్టు పోలీసులకు తెలి పారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందినప్పటికీ ఆ తర్వాత రైలు సురక్షితంగా పూరీకి చేరుకుంది.