calender_icon.png 26 November, 2024 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ అశోక్ కుమార్

29-10-2024 03:35:39 PM

కరీంనగర్ (విజయక్రాంతి): దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసుల దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్‌ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.