calender_icon.png 28 October, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలి

28-10-2024 06:28:19 PM

మందమర్రి (విజయక్రాంతి): దీపావళి పర్వదినం సందర్భంగా టపాసుల దుకాణదారులు సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ శశిధర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలో దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాసులు ఇండ్లు, షాపులు, జన సముదాయాల మధ్య గోదాములలో నిల్వ చేసిన, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరిపిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా బాణసంచా విక్రయించే దుకాణదారులు పోలీసుల సూచనలు, నియమ నిబంధనలను పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, దుకాణ యజమానులు దీపావళి సామాగ్రి ఉన్న ప్రదేశాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.