03-03-2025 11:56:34 PM
అత్యవసర పరిస్థితి విధింపు..
కొలంబియా: అమెరికాలోని సౌత్, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపించింది. అగ్నికీలల్లో 4.9 చదరపు కి.మీ మేరకు అటవీప్రాంతం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కార్చిచ్చు నేపథ్యంలో సౌత్ కరోలినా గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నార్త్ కరోలినాలోని నాలుగు వేర్వేరు చోట్ల కార్చిచ్చు వ్యాపించింది. 162 హెక్టార్ల మేర అటవీప్రాంతం దగ్ధమైంది.
జపాన్‌లోనూ..
గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా జపాన్‌లో అతిపెద్ద కార్చిచ్చు వ్యాపించింది. అక్కడి యంత్రాంగం ప్రాథమికంగా గత బుధవారం కార్చిచ్చును గుర్తించింది.. కానీ.. అప్పటికే పరిస్థితులు చేయిదాటిపోయాయి. మంటల్లో ఇప్పటివరకు 4,500 ఎకరాల్లోని అటవీప్రాంతం కాలి బూడిదైంది. 84 ఇండ్లు దగ్ధమయ్యాయి. అక్కడి అధికారులు ఆదివారం 4,600 కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పేందుకు సుమారు 1,700 మంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేస్తున్నారు.