రాజాపూర్ జనవరి 20 : రాజాపూర్ మండల పరిధిలోని సింగమ్మగూడ గ్రామపంచాయతీ హేముల నాయక్ తండ సమీపంలో ఒక్కసారిగా పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. సాగు చేసిన పంట లేకపోయినప్పటికీ భూమిపై గడ్డి ఎండిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాప్తి అధికంగా కాకుండా చేయడం జరిగింది.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయంలో కూడా జరిగి ఉంటే ఎంత మేరకు మంటలు వ్యాపించే తెలియదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిగరేటు, బీడీ తాగేవారు చుట్టుపక్కల ఎండిపోయిన గడ్డి తో పాటు తదితర పరిసర ప్రాంతాలను పరిశీలించి అగ్గి పులలను పారవేయాలని, అగ్గిపుల్లకు ఉన్న మంటను పూర్తిగా ఆర్పి పారేస్తే వేసవిలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని ఫైర్ సిబ్బంది తెలిపారు.
మండలంలోని సింగమ్మగూడ గ్రామపంచాయతీ హేమ్ల నాయక్ తండా సమీపంలోని పంట పొలాల్లో సోమవారం అకస్మాత్తుగా మాటలు అంటుకున్నాయి.దీనితో మంటలు గిరిజన తాండ చుట్టూ పంట పొలాలు అంటుకోవడాన్ని గమనించిన రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ ఇంజన్ల అక్కడికి చేరుకుని అంటుకున్న మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.