* 24 మంది మృతి..
వాషింగ్టన్, జనవరి 13: లాస్ ఏంజెల్స్‌ను గత వారం రోజులుగా కార్చిచ్చు వెంటాడుతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కు చేరింది. మరో 16 మంది ఆచూకీ గల్లంతైంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఎగసిపడుతున్న మంటలు అదుపులోకి రావడం లేదు. ఇదే అదునుగా అక్కడ దొంగలు చెలరేగిపోతున్నారు. అగ్నిమాపక సిబ్బందిలా దుస్తులు ధరించి మరీ చోరీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు తా జాగా అదుపులోకి తీసుకున్నారు.