16-04-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ని మంగళవారం రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనయ్య, హయాత్ నగర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యాదగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 14 న ప్రారంభమయ్యే అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీతో ముగుస్తాయన్నారు. అగ్నిప్రమాద సమయంలో అమరులైన అగ్ని మాపక వీరులకు నివాళులు అర్పించడంతో ప్రారంభమయ్యే వారోత్సవాలు 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణ చర్యల గురించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అగ్ని ప్రమాద నిరోధ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క విలువైన ఆస్తులకు భద్రత కల్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫిల్మ్ సిటీ డైరెక్టర్ శివరామకృష్ణ, ఫిల్మ్ సిటీ లోని వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.