14-04-2025 05:41:56 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొని మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అమూల్యమైనవని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రాణాలను, ఆస్తి నష్టం జరగకుండా ప్రజ లకు సేవ చేస్తున్న వైనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు పరిమి సురేష్, షౌకత్ పాషా ,శేషాద్రి ,జంగిలి శంకర్, రాజు నాయక్, మీర్జా, వీరేష్ ,షారుక్ ఖాన్ ,అన్నిమాపక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.