calender_icon.png 19 April, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిమాపక వారోత్సవాలు షురూ

15-04-2025 12:00:00 AM

గుంటూరు, ఏప్రిల్ 14: ఏటా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏప్రిల్ 14 నుంచి 20వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఏక్యూ జిలాని, జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సోమవారం గుంటూరు జిల్లా అగ్నిమాపక  కార్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఎండలు తీవ్రంగా ఉండే ఈ రోజుల్లో అగ్ని ప్రమాదాల సంభవించకుండా అన్ని దుకాణాల సముదాయాలు, స్కూల్స్, హాస్పిటల్స్ ప్రాంతాల్లో కచ్చితంగా ఫైర్ సేఫ్టీని పాటించాలన్నారు.

చిన్న పిల్లలకు అగ్నిమాపక వస్తువులను దూరంగా ఉంచేటట్లు చూడాలనారు. కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక సిబ్బందికి, బీహార్ అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్ ఫైటర్ ఎస్ హెచ్ రవికాంత్ మడలకు సంతాపం తెలియజేశారు. వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.