calender_icon.png 16 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

03-07-2024 12:05:00 AM

ఎల్బీనగర్, జూలై 2: పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇన్ఫర్మేషన్ కాలనీలోని ఓ ఇంట్లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మంగళవారం సాయంత్రం దుకాణం మూసివెళ్లిన తర్వాత షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పేశారు.