calender_icon.png 29 April, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావులపల్లిలో కరెంటు వైర్లు మారేదెన్నడో..?

29-04-2025 10:57:10 AM

కరెంటు అధికారుల నిర్లక్ష్యంతోనే వరి కోత మిషన్  దగ్ధం

ప్రభుత్వం ఆదుకోవాలని వరి కోత మిషన్ యజమాని ఆవేదన

స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

తుంగతుర్తి,(విజయక్రాంతి): గడిచిన బీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలనలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు ఎన్నోమార్లు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలోని దళితులు, రైతులు గ్రామంలో హై టెన్షన్ వైర్లు ఇండ్లపై, మరొక పక్కన పంట పొలాల్లో ఉన్నాయని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆనాటి అధికారుల నిర్లక్ష్యంతో నేటి వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా రావులపల్లి గ్రామస్తుల పరిస్థితులు మారాయి. నేటి ఎమ్మెల్యే మందుల సామేలు ఎన్నికల ప్రచారంలో కూడా పలువురు దళిత కుటుంబాలు హై టెన్షన్ కరెంటు తీగలు మార్చాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో జిల్లా కరెంటు ఉన్నతాధికారులు స్థానిక నాయకులు తీగల మార్పు కోసం లక్షల రూపాయల ఎస్టిమేట్ కూడా వేశారు. ఈ డబ్బులు కొంత గ్రామపంచాయతీ ఇవ్వవలసి ఉండగా పూర్తిస్థాయిలో నిధుల కొరతతో ఎటువంటి పనులు సాగక, ఉత్సాహ విగ్రహాల లాగానే మిగిలిపోయాయి. దీనితో గ్రామంలోని పొలాల్లో రైతులు వరి కోత మిషన్ తీసుకొని వచ్చి కోతల కోయడానికి ప్రయత్నించగా రైతుల పొలాల్లో వేలాడి ఉన్న వైర్లు ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో సోమవారం గ్రామానికి చెందిన కళింగం యజమాని వరి కోత మిషన్ దగ్ధం కాగా, సుమారు పది లక్షలకు పైగా నష్టం వాటిల్లదని ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన సంఘటనపై జిల్లా కరెంటు ఉన్నతాధికారు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి గత కొంతకాలంగా రైతుల పొలాల్లో వేలాడి ఉన్న వైర్లను, మరొక ప్రక్క గ్రామంలోని దళిత కుటుంబాల ఇండ్ల మీద ఉన్నతీగలను తక్షణమే మరమ్మతులు చేసి, దళిత కుటుంబాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  పెద్ద మనసుతో గ్రహించి గత 30 సంవత్సరాలుగా కానీ పనిని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ప్రత్యేక నిధులు కేటాయించి, దళిత కుటుంబాల ఇండ్లపై ఉన్న వైర్లను తొలగించాలని  గ్రామస్తులు వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.