calender_icon.png 20 April, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు

20-04-2025 12:42:44 AM

సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి కృషితో..

మహబూబాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహబూ బాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో ఫైర్ స్టేష న్ లేకపోవడం వల్ల అనేక అగ్ని ప్రమాదాలు సంభవించి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని, మహబూబాబాద్ నుంచి కేస ముద్రం అగ్నిమాపక యంత్రం రావడానికి ఆలస్యం జరగడం వల్ల నష్టతీవ్రత పెరుగుతుందనే అంశాన్ని వివరిస్తూ.

ఈ నెల 8న విజయక్రాంతి దినపత్రికలో ‘కేసముద్రానికి ఫైర్ స్టేషన్ వచ్చేనా?’ శీర్షికతో ప్రత్యేక కథ నం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ప్రత్యేక కృషి చేసి కేసముద్రం లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమో దం పొందేలా చూశారు. 17 మంది రెగ్యుల ర్ ఉద్యోగులు, ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కేటాయిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్త శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.