- తనిఖీలకు 10 ప్రత్యేక బృందాలు
- వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖానలను అగ్ని ప్రమాద రహితంగా మార్చాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రు ల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి శనివారం సమీక్షించారు.
సర్కారు ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి నివేదిక ఇచ్చేందుకు 10 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాలు మొదట గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటల్స్‌లో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేయాలని ఆదేశిం చారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. రాష్ర్టంలోని అన్ని హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫైర్ అలార్మ్స్, స్మోక్ట్ డిటెక్టర్స్‌ను పరిశీలించాలన్నారు.
ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై సెక్యూరిటీ, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి హాస్పిటల్‌లో అగ్ని ప్రమా దాల నివారణకు సంబంధించిన ప్లాన్ రూపొందించి, దానిపై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలన్నారు.