18-04-2025 12:00:00 AM
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్
గుంటూరు, ఏప్రిల్ 17: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను ని వారించవచ్చని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. గురువారం గుంటూరు అమరావతి రోడ్డులోని నెక్స్ జెన్ ఇంటర్నేషనల్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో నీ రు, ఫికస్డ్ ఫైర్ ఫైటింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు, హడలిపోకుండా ఫైర్ సిబ్బంది చూపించిన డెమో ప్రకారం అందుబాటులో ఉన్న పరికరాలను వాడాలని తెలిపారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి, జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదంలో 90 మీటర్ల ఎత్తున ప్రదేశంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించవచ్చో చూపించారు.
సిలిండర్ ద్వారా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలు ఎలా ఆర్పాలో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తో పాటు స్కూల్ డైరెక్టర్ కె శ్రీకాంత్, చీఫ్ ల ర్నింగ్ ఆఫీసర్ శ్రీవిద్య, ప్రిన్సిపల్ సుధీర్ కృ ష్ణన్, ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.