విశాఖ స్టేషన్‌లో ఆగి ఉన్న రైల్లో అగ్నిప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా
ప్రాణనష్టం జరగలేదని అధికారుల వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): విశాఖపట్టణం రైల్వేస్టేషన్‌లో కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందిం చిన రైల్వేశాఖ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులను ఘటనాస్థలానికి దూరంగా పంపించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి ఉదయం 6 గంటలకు విశాఖకు చేరుకుందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణంగా అధికారులు భావిస్తు న్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరమే తెలుస్తాయని పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరుచేసి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవ డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాణనష్టం సంభవించలేదు
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సం భవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని చెప్పారు. 10 గంటలకు రైల్లో మంట లు చెలరేగాయని చెప్పారు. రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు.