calender_icon.png 3 February, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం

02-02-2025 11:55:15 PM

మేడిపల్లి, ఫిబ్రవరి 2, (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ భగాయత్ శిల్పారామం దగ్గర ముర్ఫీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే భగయత్ ఒక షెడ్డులో మర్ఫీ కంఫర్ట్ కంఫర్ట్ పరుపులు, దిండ్లకు సంబంధించిన హాలో సేల్ గోదాం ఉంది.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకేసారి మంటలు చెలరేగడంతో అది గమనించిన స్థానికులు ఫైర్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పడం జరిగింది. సుమారు 60లక్షల ఆస్థి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.