గద్వాల, జనవరి 7 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో బీరొల్లు రోడ్డులో గల వెంకటేశ్వర కాలనీలో గల ఓ అల్యూమినియం గ్లాస్ గోదాంలో మంగళవారం మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు గోదాం నిర్వహకులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాధి తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో పవన్ అల్యూమినియం అండ్ గ్లాస్ దుకాణాన్ని నల్లకుంటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అల్యూమినియం అండ్ గ్లాస్ కు మెటీరియల్స్ తయారు చేయడం కోసం వెంకటేశ్వర కాలనీలో గోదాంను ఏర్పాటు చేసుకుని మెటీరియల్ తయారు చేసి విక్రయించేవాడు.
మంగళవారం ఉద యం అల్యూమినియం అండ్ గ్లాస్ గోదాం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో. స్థానికులు గమనించి వెంటనే నిర్వాహ కులకు సమాచారం అందించారు. వారొచ్చి మంటలు ఆర్పి వేశారు. దీంతో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిన్నట్లు వ్యాపారి తెలిపాడు. కాగ గుర్తు తెలియని వ్యక్తులు గోదాం యొక్క కిటికీల అద్దాలను పగులగొట్టి నిప్పం టించారని వ్యాపారి ఆరోపించాడు.
గత కొం తకాలంగా బీరొల్లు చౌరస్తా, సెకండ్ రైల్వే గేట్, వెంకటేశ్వర కాలనీ, బృందావన్ కాలనీ, శివాలయం రోడ్డు, తదితర ప్రాంతాలలో ఆకతాయిల ఆగడాలు మితీమీరిపోయాయ ని, ఆకతాయిలే ఈ అఘాయిత్యానికి పాల్ప డిండవచ్చని బాధితుడు ఆరోపించారు.
గోదాంలో ఉన్న అల్యూమినియం, గ్లాస్ తది తర మెటీరీయల్ అగ్నికి అహుతి అయిన్న ట్లు సుమారు రూ.4లక్షల ఆస్థి నష్టం వాటిలిందన్నారు. కాగ బాధితులు గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కల్యాణ్ రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.