వాంకిడి (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని ఇందాని ఎక్స్ రోడ్ వద్ద గల ఆర్బీ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి నిల్వ ఉన్న పత్తి కుప్పకు అంటుకుంది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.