14-04-2025 12:12:48 AM
రామకృష్ణాపూర్ ఏప్రిల్ 13 : కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ లో మూసివేసి ఆర్కే ఓసి ఉపరితల గనిలో ఆదివారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే వేసవి కాలం అవడం వల్ల చెట్లకు ఉన్న ఆకులు రాలిపోయాయి ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి.
మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రదేశాన్ని గుర్తించిన ఎస్ అండ్ పీసీ ప్రవేట్ సిబ్బంది తక్షణమే సింగరేణి అధికారులకు, ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. అధికారులు, ఎస్‌అండ్ పీసీ, రెస్క్యూ, విద్యు త్ సిబ్బంది మంటలను అర్పివేసేందుకు ప్రయత్నించారు. సంఘటన స్థలనానికి చేరుకున్న మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అర్పివేశారు.