20-03-2025 09:12:51 AM
పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై ఘటన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ లోని PVNR ఎక్స్‌ప్రెస్ వే(PVNR Express Way) పై రన్నింగ్ కారు లో మంటలు చెలరేగాయి. అత్తాపూర్ 151 పిల్లర్ నెంబర్ వద్ద టాటా క్వాలీస్ కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రముత్తమై కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల మీద కారు అగ్నికి అహుతి అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పే యత్నం చేశారు. కారు ఇంజన్ ఓవర్ హీట్ కావడంతో మంటలు వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.