19-02-2025 12:24:46 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): ఓ మెకానిక్ షెడ్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని ఓ మెకానిక్ షెడ్ లో మంగళవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.