ఖమ్మం: ఖమ్మం జిల్లా(Khammam District)లోని పత్తి మార్కెట్(Cotton Market) లో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందల పత్తి బస్తాలు మంటల్లో కాలి బూడిదయింది. మార్కెట్ సిబ్బంది(Market staff) సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మార్కెట్ చుట్టుపక్కల గల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.