calender_icon.png 24 February, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ ఐసీఐసీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం

24-02-2025 12:00:00 AM

షార్ట్ సర్కూ ్య ప్రమాదానికి కారణం

 గజ్వేల్,  ఫిబ్రవరి23:  గజ్వేల్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకులో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం బ్యాంకు కొనసాగుతున్న భవనంపై  మరో మూడు అంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతు న్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో పై అంతస్తుల నిర్మాణాలకు నీటి తడులు ఇవ్వగా  ఆ నీరంతా  భవనం ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పై పడటంతో ట్రాన్స్ఫార్మర్ ఒక్క సారిగా పేలింది. ఇదే క్రమంలో బ్యాంకు భవనం కూడా తడిగా ఉండడంతో  బ్యాంకు లో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని్ర పమాదం సంభవించి ఉండవచ్చునని  కొం దరు స్థానికులు వెల్లడించారు.  ఈ ఘటన తో చాలాసేపు వరకు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.

కాగా  ప్రమాద సంఘటన విషయాన్ని తెలుసు కొని బ్యాంకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. విద్యుత్ శాఖ అధికారులు పరిస్థితి పరిశీలించి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.  బ్యాంకు కొనసాగుతున్న భవనం రోడ్డు వరకు నిర్మించడమే కాకుండా ఆ భవనంపై మరో మూడు అంతస్తులు కూడా ప్రస్తుతం నిర్మిస్తున్నా, మున్సిపల్ అధికారులు పట్టిం చుకోకపోవడం ఏమిటని ప్రజలు గుసగు సలాడుకున్నారు. పరిమితులు దాటి భవనం ముందుకు నిర్మించడంతోనే ట్రాన్ష్‌ఫార్మర్ అతి దగ్గరగా ఉండి ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.