calender_icon.png 24 January, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం

24-01-2025 12:00:00 AM

మేడ్చల్, జనవరి 23(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ ధాబా పక్కన ఎలక్ట్రికల్ శానిటరీ దుకాణంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు పొగను చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు  వచ్చి మంటలను ఆర్పారు. దుకాణం యజమాని భవనం పైన నివసిస్తారు. గత నాలుగు రోజులుగా స్థానికంగా లేరు. వారి బంధువు కోటి రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని తెలిపాడు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.