10 లక్షల ఆస్తి నష్టం
రాజేంద్రనగర్, నవంబర్ 20: అత్తాపూర్ పీఎస్ పరిధిలోని శివరాంపల్లిలో గాయత్రి జూనియర్ కాలేజీకి ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మి క్లాస్ టెక్స్‌టైల్‌లో బుధవారం మం టలు చెలరేగాయి. దట్టమైన పొగ లు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘట నా స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
అప్పటికే సుమారు 10 లక్షల విలువైన బట్టలు, ఇతర సామగ్రి దగ్ధమైందని బాధితులు, అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమా దం చోటుచేసుకున్నట్లు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.