- 1౦ మంది చిన్నారులు మృతి.. కొందరికి గాయాలు
- ౩7 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్
- యూపీలోని ఝాన్సీ పట్టణంలో ఘటన
బెంగళూరు, నవంబర్ 15: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆసుపత్రి లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం ౧౦ మంది చిన్నారులు మరణించినట్లు తెలుస్తోం ది.
సమాచారం అందుకున్న అగ్నిమా పక సిబ్బంది హుటాహుటిన ఆసుప త్రికి చేరుకుని ౩7 మంది చిన్నారు లను రక్షించారు. మంటలు వ్యాపించి న సమయంలో ప్రజలు భయపడి పరిగెత్తడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా గుర్తించినట్లు ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్‌కు మార్ తెలిపారు.
మరణించిన చిన్నా రుల కుటుంబాలకు యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.