calender_icon.png 16 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

31-08-2024 03:05:41 AM

  1. రియాక్టర్ వద్ద వాల్వ్ నుంచి లీకైన రసాయనాలు 
  2. చెలరేగిన మంటలు, పొగ 
  3. శ్రీపతి ల్యాబ్‌లో ఘటన

నల్లగొండ, ఆగస్టు 30 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులోని శ్రీపతి ల్యాబ్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ వాల్వ్ నుంచి రసాయనాలు లీకై మంటలు చెలరేగి రెండు కిలోమీటర్ల మేర పొగ అలుముకుంది. కార్మికులు అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. శ్రీపతి ల్యాబ్‌లో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తారు. పరిశ్రమలో ఆరు రియాక్టర్లు ఉండగా ఉదయం 10 గంటల సమయంలో క్యూ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో బ్లాక్‌లో 10 మంది పనిచేస్తున్నట్టు తెలిసింది.

మరో ఐదుగురు విధులు ముగించుకొని వెళ్లినట్టు సమాచారం. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో రియాక్టర్ పేలిందని భావించారు. రియాక్టర్ సమీపంలోనే పైపులైన్ నుంచి రసాయనాలు లీకై మంటలు వచ్చినా.. పేలకపోవడంతో ప్రాణనష్టం సంభవించ లేదు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పరిశ్రమలో ప్రమాదంపై ఆరా తీశారు. చిట్యాల పోలీస్ సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు.