28-03-2025 12:02:11 AM
క్షణాల్లో కాలిపోయిన ‘స్కొడా స్లావియా’
చేవెళ్ల, మార్చి 27: స్కోడా స్లావియా కారు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో క్షణాల్లో దగ్ధమైన ఘటన చేవెళ్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. కారులోని వ్యక్తి ఆప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్త్స్ర శ్రీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కవ్వగూ డం రాజశేఖర్ రెడ్డి తన స్కోడా స్లావియా కారు (టీఎస్ 07జేజే3335)లో గురువారం 12 గంటల సమయంలో హైదరాబాద్ బయల్దేరాడు.
కందవాడ గేట్ వద్ద డ్యాష్బో ర్డు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిందకు దిగి వెంటనే ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇచ్చాడు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే మంటలు తీవ్రమై కారు పూర్తిగా కాలి బూడిదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.