calender_icon.png 25 December, 2024 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్‌మిల్లులో అగ్ని ప్రమాదం

02-11-2024 01:52:53 AM

12 లక్షల ఆస్తి నష్టం

చేగుంట, నవంబర్ 1: నార్సింగి మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం జరిగింది. మిల్లు యజమాని కథనం ప్రకారం.. దీపావళి పండుగ సందర్భంగా గురువారం రాత్రి మిల్లులో పూజలు నిర్వహించి యజమాని ఎర్రం శ్రవణ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. శుక్రవారం మిల్లులో మంటలు చెలరేగగా భారీ సంఖ్యలో ఉన్న గన్నీ బ్యాగులు పూర్తి గా దగ్ధమయ్యాయి.

షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ భారీ ఎత్తున గన్నీ బ్యాగులు దగ్ధం కావడంతో సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు యజమాని శ్రవణ్‌కుమార్ తెలిపారు.