calender_icon.png 10 January, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మై హోమ్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

03-01-2025 07:37:49 PM

హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోకాపేట్(Kokapet) నియో పోలీస్ లే అవుట్‌లోని మై హోం ప్రాజెక్ట్‌లో ఘటన చోటుచేసుకుంది. అయితే స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు హైదరాబాద్ శివారు ప్రాంతమైన జీడిమెట్ల పారిశ్రామికవాడ(Jeedimetla Industrial Estate) ధూళ్లపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.హైదరాబాద్‌లో 2024లో 2500 అగ్ని ప్రమాదాలు, రూ. 822 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు వెల్లడించారు. నగరంలో ఈ ఏడాది సుమారు 2,500 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 7,600 ప్రమాదాలు సంభవించాయి. ఫలితంగా 200 మందికి పైగా మరణాలు, రూ. 822 కోట్ల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.