calender_icon.png 21 April, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిమాపక శాఖ సేవలు అమోఘం

21-04-2025 02:04:07 AM

ఎల్లారెడ్డి,ఏప్రిల్ 20 ( విజయక్రాంతి ), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 11 వ వార్డు లో ఆదివారం ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక  వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా పాల్గొని ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి సేవలను గుర్తు చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులను గుర్తు చేశారు.

అగ్నిమాపక సిబ్బంది సేవలు అమోఘమని తెలిపారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో  వారోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో ప్రతి ఒక్కరికి, ప్రతి షాపింగ్ సెంటర్స్ వద్దా ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఫైర్ డ్రిల్స్ ఏర్పాట్లు చేశారు.

అందరికీ అవగాహన చేయడం చాలా సంతోషకరం అని అన్నారు.   ఫైర్స్ సిబ్బందికి గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్   ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపమని చెప్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు.