calender_icon.png 10 January, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాస్ ఏంజెల్స్‌ను దహిస్తున్న కార్చిచ్చు

10-01-2025 01:29:58 AM

  1. * ఐదుగురు మృతి, 1.3లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు
  2. * డాల్బీ థియేటర్‌కూ పొంచి ఉన్న ముప్పు
  3. * ప్రాథమిక అంచనా ప్రకారం 50 మిలియన్ల సంపద అగ్గిపాలు
  4. * వేధిస్తున్న నీటి కొరత
  5. * విదేశీ పర్యటన రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

వాషింగ్టన్, జనవరి 9: ప్రపంచంలో సంపన్నుల నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. మంటల్లో చిక్కుకుని 5 గురు ప్రాణా లు కోల్పోయారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేతుండటంతో దాదాపు 1.3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాం తాలకు తరలివెళ్లారు. మొత్తంగా 2000 నిర్మాణాలు దగ్ధమైనట్టు లెక్కలు చెబుతున్నాయి. 

మంటల కారణంగా లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. దీని వల్ల లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లోని 17 మిలియన్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కార్చిచ్చును ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోగా కొత్త ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. హాలివుడ్ చిహ్నానికి నిలయంగా భావించే హాలివుడ్ హిల్స్‌లో కొత్తగా కార్చిచ్చు పుట్టుకొచ్చింది. దీనిని సన్‌సెట్ ఫైర్‌గా అధికారులు అభివర్ణించారు. లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం సన్‌సైట్ ఫైర్.. రన్యోన్ కాన్యన్, వాటల్స్ పార్క్ మధ్య సుమారు 20 ఎకరాలను దగ్ధం చేసింది.

సన్‌సెట్ ఫైర్‌తో కలిసి లాస్ ఏంజెల్స్ వ్యాపతగా మొత్తం ఆరు చోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు అధికారులు ప్రకటించారు. వీటిల్లో పాలిసాడ్స్‌లో మంగళవారం చెలరేగిన కార్చిచ్చును అతిపెద్దదిగా అధికారులు పేర్కొనానరు. పాలిసాడ్స్‌లో ఏర్పడిన కార్చిచ్చు సుమారు 15,800 ఎకరాలను కాల్చిబూడిద చేసినట్టు అంచనా వేశారు. 

డాల్బీ థియేటర్‌కు ముప్పు

ఏటా ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే డాల్బీ థియేటర్‌కు సన్‌సెట్ కార్చిచ్చు ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. దానితో పాటు లాస్ ఏజెంల్స్ ప్రఖ్యాత ల్యాండ్ మార్క్‌లుగా గుర్తింపు పొందిన హాలివుడ్ బౌల్ ఔట్‌డోర్ యాంపీథియేటర్, హాలివుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ కు కూడా ప్రమాదం పొంది ఉంది. కార్చిచ్చు కారణంగా గ్లిట్జి అవార్డుల ప్రదర్శన, పమేలా అండర్సన్ ఫిల్మ్ ప్రీమియర్‌లను నిర్వాహకులు రద్దు చేశారు.

పాలిసాడ్స్ ప్రాంతంలో ప్రజల తరలింపు ఆదేశాలు అమలవుతుండగా లారెల్ కాన్యన్ బౌలేవార్డ్, ముల్‌హూ లాండ్ డ్రైవ్ ప్రాంతాల్లో బుధవారం సాయం త్రం అధికారులు తరలింపు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. 

జో బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం

మాలిబులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కార్చిచ్చులో కాలిపోయింది. రియాల్టీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యాజిన్ లెవీ, బిల్లి క్రిస్టల్, జాన్ గుడ్‌మన్ ఇళ్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి.

లాస్ ఏంజెల్స్ సంపన్న ప్రాంతం కావడంతో కార్చిచ్చు కారణంగా ఏర్పడిన నష్టం భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రథమిక అంచనాల ప్రకారం 50 మిలియన్ డాలర్ల సంపద అగ్గిపాలైనట్టు తెలుస్తోంది. 

కార్చిచ్చుకు ప్రధాన కారణాలు

లాస్ ఏంజెల్స్‌లో చెలరేగుతున్న కాచ్చిచ్చు కు ప్రకృతి సంబంధమైన కారణాలతోపా టు మానవ తప్పిదాలు కూడా కారణంగా ఉన్నట్టు తెలుస్తుంది. గత శతాబ్దం కాలంగా లాస్ ఏంజెల్స్‌లో శాంత అనా గాలులు ఉదృతంగా వీస్తు న్నాయి. వీటకి మంటలను చాలా వేగంగా వ్యా పింపచేసే శక్తి ఉంది.

ప్రజలు పొరపాటున ఎక్కడైనా నిప్పు రవ్వలను వెలిగించి అప్రమత్తంగా లేకపోతే కార్చిచ్చులకు దారి తీస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. బహుశా అదే జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

బైడెన్ విదేశీ పర్యటన రద్దు

లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటలీ, రోమ్‌లలో పర్యటించాల్సి ఉండగా బైడెన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు వైట్ హౌస్ ప్రక టించింది.

లాస్ ఏంజెల్స్‌లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడి యా వేదికగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. లాస్ ఏంజెల్స్ గవర్నర్ తక్షణమే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. 

వెంటాడుతున్న నీటి సమస్య 

ఒక వైపు కార్చిచ్చు చుట్టేస్తుంటే లాస్ ఏంజెల్స్‌లో నీటి కొరత ఇబ్బంది పెడుతోంది. మంటలు ఆర్పడానికి సరిపడ నీ టి వనరులు లేకపోవడం అగ్నిమాపక సి బ్బంది ప్రయత్నాలకు అడ్డంకిగా మారిన ట్టు తెలుస్తోంది. భీకర గాలుల వల్ల మం టలు అదుపు చేయడం కష్టంగా మారిందని అయినప్పటికీ తీవ్రంగా కృషి చేసి చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.