చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఫార్మా ల్యాబ్ లో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీపతి ఫార్మా ల్యాబ్ లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.