calender_icon.png 23 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి సబ్ స్టేషన్ కెపాసిటర్‌లో చెలరేగిన మంటలు

22-02-2025 10:38:57 PM

ఆందోళన చెందిన విద్యుత్ శాఖ అధికారులు

పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సబ్ స్టేషన్ కెపాసిటర్ లో శనివారం సాయంత్రం మంటలు చెల రేగడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సబ్ స్టేషన్ అధికారులు పైరు సిబ్బందికి సమాచారం అందించారు. అడ్లూరు శివారులోని సబ్ స్టేషన్ కెపాసిటర్ బ్యాంకులో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ విషయమై స్థానిక ఎస్ ఈ శ్రావణ్ కుమార్ ను వివరణ కోరగా సబ్ స్టేషన్లలో పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదని సబ్ స్టేషన్ కెపాసిటర్ బ్యాంకులో సేల్స్ కొత్తవి కాకపోవడం వల్లే మంటలు చెలరేగాయని తెలిపారు. కొత్త సేల్స్ అమర్చనున్నట్లు ఎస్ ఈ తెలిపారు.